మాజీ మంత్రి కేటీఆర్ తప్పు చేయకపోతే గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుము కుంటున్నారు అంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ షాడో సీఎంగా పని చేశారన్నారని, ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తప్పు చేయకపోతే.. గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుముకుంటున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చిన్న సమస్య అని ఎందుకు అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగం వారి ఫోన్లు ట్యాప్ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్, ప్రత్యర్థుల ఫోన్‌లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు కటకాటాలోకి వెళ్తారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజం విచారణలో అన్నీ తెలుతాయని, కేటీఆర్ తొందర పడుతున్నారని సూచించారు.
ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. తుక్కుగుడ సభకు యువత, నిరుద్యోగ యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తెలంగాణలో క్షేత్ర స్థాయికి ఎన్ఎస్ యూఐ తీసుకువెళ్తుందన్నారు. ఈనె 8వ తేదీ నుండి నియోజక వర్గ స్థాయి సభలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతీ రోజు రెండు నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాకా ఏం చేయబోతోంది అనేది వివరిస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు.









