అమ్మన్యూస్ ప్రతినిధి, సంగారెడ్డి: ఎస్బీ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్‌కు కారణమైంది. కోల్డ్ వార్‌కు కారణాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ లోని బుధవారం సాయంత్రం ఎస్బీ పరిశ్రమలో పేలుడుకు ఆరుగురు కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందారు. అలాగే 25 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలుసుకుని జిల్లా ఇన్చార్జ్, మంత్రి కొండా సురేఖ పరిశ్రమ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం నుంచి ప్రకటించారు. ఇదిలా ఉండగా.. జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాద విషయం తెలుసుకుని పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆలస్యం జరిగిందని ఆలోపే మంత్రి కొండా సురేఖ రావడం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ తరుణంతోనే అధికారులతో మాట్లాడి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో తన జిల్లాలో మంత్రి కొండా సురేఖ హల్చల్ చేయడం ఏంటని తన సన్నిహితుల వద్ద మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పినట్లు సమాచారం. మరోవైపు జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించాల్సిన ఎక్స్ గ్రేషియాను, మంత్రి కొండా సురేఖ ప్రకటించడంతో సొంత జిల్లాలో ఆయనకు ఏం జరుగుతుందో తెలియదని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ సహజమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.









