AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్‌కు తీవ్ర జ్వరం.. రెండు రోజుల ప్రచారానికి బ్రేక్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా ఇవాళ తెనాలిలో జరగాల్సిన పర్యటన రద్దయింది. నాలుగు రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ అస్వస్థతకు గురైనప్పటి నుంచి అస్వస్థతకు గురయ్యారు. జ్వరం తీవ్రతరం అయ్యేంత వరకు అతను ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో జ్వరం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రేపటి నెలిమర్ల పర్యటన కూడా రద్దయినట్లు పార్టీ వెల్లడించింది. కాగా ఇవాళ్టి షెడ్యూల్ ప్రకారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ భేరి యాత్రలో భాగంగా బుధవారం తెనాలిలో పర్యటించి.. మార్కెట్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నందున కనీసం 2 నుంచి 3 రోజుల వరకు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారని, రీ షెడ్యూల్ చేసి పర్యటన పున:ప్రారంభిస్తామని పార్టీ నేతలు చెప్పారు.

ANN TOP 10