AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు కష్టాలు తెలుసుకునేందుకు ఏసీ బస్సు కావాలా?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై జయశాంతి ఫైర్‌
(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నం తిన్నారో, అటుకులే తిన్నారో కానీ… మన తోటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో కష్టపడ్డారు, కొట్లాడారు, ప్రాణాలిచ్చారని ఆమె గుర్తు చేశారు. రైతుల కష్టాలను పరిశీలించేందుకు వెళ్తున్న కేసీఆర్‌… ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న ఏసీ బస్సులో వెళ్లారని… ఇంత విలాసవంతమైన బస్సు ఎందుకు కేసీఆర్‌ గారూ? అని ప్రశ్నించారు. ఇప్పటికీ, ఎప్పటికీ భవిత రహిత సమితి (బీఆర్‌ఎస్‌) విధానం మారదా? అని అడిగారు.

మీమీద ఉన్న నిన్నటి గౌరవంతో.. మీరు మారితే మంచిదని తెలంగాణ సమాజం అనుకుంటోందని విజయశాంతి అన్నారు. కానీ ఎందుకో మీరు ఉద్యమ గతాన్ని మర్చిపోయారని విమర్శించారు. అందరూ విమర్శించే అధికార దర్పణ విధానాన్ని మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నట్టు ఉందని దుయ్యబట్టారు. జై తెలంగాణ హరహర మహాదేవ్‌ అని ట్వీట్‌ చేశారు విజయశాంతి.

ANN TOP 10