(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పల్లా మీడియాతో మాట్లాడుతూ కడియం హస్తం గూటికి చేరే కుట్రకు అసెంబ్లీ సమావేశాల్లోనే బీజం పడిరదన్నారు. అందుకే ముందుగా బీఆర్‌ఎస్‌లోని నాయకులను వేధించి, వెళ్లగొట్టి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పెద్ద మోసగాడు కడియం శ్రీహరి అని పల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.









