AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి.. ఇండ్లలోకి వచ్చి చేరిన నీరు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు.

ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్‌కు గండి పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లలోకి వరద నీరు చేరి సామాగ్రి పూర్తిగా తడిసిపోయాని.. ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు మొదలు పెట్టి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ANN TOP 10