AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎల్‌పీజీ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు.. త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర!

చ‌మురు కంపెనీలు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు చెప్పాయి. 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రపై రూ. 30.50 త‌గ్గించాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ సిలండ‌ర్ ధ‌ర రూ. 1764.50 గా ఉంది. అలాగే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 7.50 త‌గ్గింది. కాగా, మార్చి 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రను పెంచిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ నెల మాత్రం రూ. 30.50 త‌గ్గించాయి. త‌గ్గిన ధ‌ర‌లు ఇవాళ్టి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇక‌ గృహ అవ‌స‌రాల కోసం వినియోగించే సిలిండ‌ర్ ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయ‌లేదు.

ఇదిలాఉంటే.. ఇంధన ధరలు, మార్కెట్ డైనమిక్స్‌లో చోటు చేసుకునే హెచ్చుతగ్గుల కార‌ణంగా గ్యాస్‌ ధరలలో సవరణలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి 1న ఇండేన్ గ్యాస్ సిలిండర్ల ధరలు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక్కొక్కటి ఒక్కో రేట్లు ఉన్నాయి.

ANN TOP 10