తాడిపత్రిలో వివాహ నిశ్చితార్థ వేడుకలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కావేటి సముద్రం హనుమంత్ రెడ్డి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడు కాంగ్రెస్ పార్టీ దౌల్తాబాద్ ఇన్చార్జి శ్రీరామ్ రెడ్డి వేడుకకు ఇరు నాయకులు హాజరయ్యారు.
అయితే ఫంక్షన్ హాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని టిడిపి వైసిపి వర్గాలను పోలీసులు భయటకు పంపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగినట్టు అక్కడి అధిరకారులు తెలిపారు. శ్రీరామ్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏపీలోని తాడిపత్రి నియోజకవర్గం కావేటి సముద్రం శ్రీరామ్ రెడ్డి సొంత గ్రామం. వైసీపీలో కొనసాగుతున్న శ్రీరామ్ రెడ్డి బంధువులు వివాహ వేడుకల్లో టిడిపి, వైసీపీ నాయకులు ఒకే సమయంలో పాల్గొనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.








