AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానంతో మాట్లాడి, ఆశావహులపై చర్చించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండటంతో నేడు అధిష్ఠానంతో చర్చించి పేర్లు ఖరారు చేస్తారు.

ANN TOP 10