విద్యుత్ వెలుగులతో రాత్రుళ్లు జిగేల్ మనేలా ఉండే హైదరాబాద్ శనివారం రాత్రి గంటపాటు చీకటిగా మారింది. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, చార్మినార్, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అపార్ట్‌మెంట్లు, పలు కమ్యూనిటీల్లోనూ గంటసేపు స్వచ్ఛందంగా ప్రజలు విద్యుత్‌ను నిలిపివేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ (Earth Hour 2024)కు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యవసరం కాని విద్యుత్ వాడకాన్ని నిలిపివేశారు.