చేరికల సభలో కంది శ్రీనివాస రెడ్డి భరోసా
ఖుర్షీద్ నగర్ నుండి భారీ చేరికలు
కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కెఎస్ ఆర్
మరోపదేళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకాలేదని వెల్లడి
ఎన్నికలేవైనా చేతి గుర్తుకే ఓటెయ్యాలని పిలుపు
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ : వచ్చే పదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్‌లో ఏర్పాటు చేసిన రాంపూర్ భోజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. పట్టణంలోని ఖుర్షీద్ నగర్ నుండి వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ అంజా,కాలనీ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్,ఎస్. సి మహిళా అధ్యక్షురాలు బేబీ కానిందే, వార్డు మెంబర్లు దేవిదాస్,ధర్మాజీ లతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరుకంది శ్రీనివాస రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలేవైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు ,కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన
ప్రజలు మెచ్చే చక్కటి ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా ముందుకు పోతుందన్నారు.ఇలాంటి ప్రజా ప్రభుత్వం మరో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు మేలు చేసే ప్రభుత్వ మన్నారు.ఆరు గ్యారెంటీలతో అధికారంలోకొచ్చిన సర్కార్ 100 రోజుల్లోనే అయిదు హామీలు అమలు చేసిందన్నారు.ఇచ్చిన మాట మీద నిలబడే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ది అన్నారు.మహిళలకు ఉచితబస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం మన్నారు.ఉచిత విద్యుత్ ను అందించడమే కాకుండా 500 గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ,ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం లాంటి గ్యారెంటీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. 100 రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. అంతేకాదు
త్వరలో మెగా డీఎస్సీ ద్వారా 11 వేల పైగా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తుందని దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందన్నారు.
మళ్లీ మళ్లీ చేతి గుర్తు కే ఓటేయాలి
ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి అంతా సహకరించాలన్నారు. వచ్చే ఎలక్షన్లు ఏవైనా చేతి గుర్తుకే ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలంగాణాలో కూడా బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయ్యిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అందరూ చేతి గుర్తుకే ఓటేసి కాంగరెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
నేను మీవాడిని ..
అసెంబ్లీ ఓట్లప్పుడు తన మీద దుష్ప్రచారం చేసారని ,మీ అందిరికి గెలిపించాలని ఉన్నా తన ఓటమికి కొందరు కంకణం కట్టుకుని పని చేసారని అన్నారు. అయినా తన మీద నమ్మకంతో దాదాపు 49 వేల మంది వరకు ఓటేసారని వారికి ధన్యవాదాలన్నారు. తను ఓడినా ఎప్పటికీ ప్రజల మనిషినేనని ప్రజల కోసమే తానున్నానన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,పార్లమెంట్ కో.ఆర్డినేటర్ షెడ్మాకి ఆనంద్ రావు,బాయిన్ వార్ గంగా రెడ్డి,గడ్డం జగదీష్ రెడ్డి,నిమ్మల ప్రభాకర్,మునిగేల విట్టల్,కిజర్ పాషా,కయ్యుమ్,సయ్యద్ షాహిద్ అలీ,సుధాకర్ గౌడ్,బాసా సంతోష్,మహిపాల్ రెడ్డి,పోతన్న,బూర్ల శంకరయ్య,మోరేష్, దర్శనాల చంటి తదితరులు పాల్గొన్నారు