AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొన్నానికి పిచ్చిపట్టింది.. అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు

ఆయన ఓ ఆవేశం స్టార్‌
మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి
ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పిచ్చిపట్టిందని, అందుకే ఆయన తిక్కతిక్కగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్‌ ఆవేశం చూస్తుంటే.. ఆయనను ఆవేశం స్టార్‌ అని పిలవాలని ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఫోన్‌ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడియోలో ఎమ్మార్వోలతో మాట్లాడిన మాటలు సిగ్గుచేటన్నారు. ఆర్డీవోకి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు.. సీఎస్‌ కు ఫిర్యాదు చేస్తా అంటున్నాడు. ఆయనపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంను కూడా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని కౌశిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్డీవో, ఎమ్మార్వోలకు నా నుంచి ఒక్క ఫోన్‌ కాల్‌ ఉన్నా.. ఛాలెంజ్‌ కు సిద్ధం అన్నారు.

కుక్కకి బొక్క దొరికినట్లుగా మంత్రి వ్యవహారశైలి ఉందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ మారడంపై స్పీకర్‌ కు ఫిర్యాదు చేశామని కౌశిక్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కూడా దానం పేరును ప్రకటించారన్నారు. ఇప్పటికైనా స్పీకర్‌ వెంటనే దానం నాగేందర్‌ పై చర్యలు తీసుకోవాలని కౌశిక్‌ రెడ్డి కోరారు.

ANN TOP 10