AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ తోటే కమ్మలకు న్యాయం: రేణుకా చౌదరి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మలకు న్యాయ చేస్తారనే నమ్మకం ఉందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ధీమాను వ్యక్తం చేశారు. గురువారం రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేణుకా చౌదరిని ప్రతినిధులు కోరారు. గత రెండు రోజుల క్రితం 16 కార్పొరేషన్‌లు ఫెడరేషన్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అందులో కమ్మ కార్పొరేషన్ లేకపోవటంతో వారు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడారు.

అన్ని కులాలని కలుపుకు పోయేది కమ్మ సామజికవర్గమని అన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు అని, చాలామంది తనను ఎన్టీఆర్ కూతురు అనుకునే వారని గుర్తు చేశారు. కమ్మ వారిలో రైతు కూలీలు కూడా ఉన్నారని చెప్పారు. కమ్మవారికి ఈ కరువు సమయంలో కార్పొరేషన్ చాలా అవసరమని తెలిపారు. మనం పోయాక విగ్రహాలు ముఖ్యం కాదని, మనం తీర్చి దిద్దే జీవితాలు శాశ్వతమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ ద్వేషి రాష్ట్రం ఏలుతున్నారని, తన పక్కన వారితో కమ్మలని తిట్టించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పౌరుషం పట్టుదల ఉన్న సామాజిక వర్గం మనది ఈ రోజుల్లో అది చాలా ముఖ్యమని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు.

ANN TOP 10