AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ -1 దరఖాస్తు గడువు పెంపు

నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మరో రెండు రోజులు గడువు పెంచుతున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కాగా… ఇవాళ్టి(మార్చి 14)తో ముగియనుంది. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీకి ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 2.7లక్షల వరకు అభ్యర్థులు గ్రూప్‌-1 కోసం దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్‌ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మరో రెండు రోజులు అవకాశం కల్పించడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.

ANN TOP 10