కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. తమ పార్టీ చీఫ్ తలకు గాయమైనట్లు తెలిపింది.
అలాగే మమతా బెనర్జీ నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మమతా బెనర్జీ కోలుకునేలా అంతా ప్రార్థించాలని కోరింది. అయితే ఆమె ఎలా ప్రమాదం బారిన పడ్డారో అన్నది టీఎంసీ వెల్లడించలేదు. అయితే మమతా బెనర్జీ ఇంట్లో జారి పడటంతో తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తున్నది.