సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించారు. రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఏపీ రాజధాని విషయంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖ పట్టణం నుంచే పాలన చేస్తానని, మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉంటానని, అలాఅని అమరావతికి మేం వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు. లేజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి కొనసాగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తాం. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది.. ఈ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ అన్నారు. బెంగళూరు కంటే వైజాగ్ లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి.. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం.. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకమని జగన్ చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందని, అమరావతికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. అమరావతిలో మౌలిక సదుపాయాలకు రూ. లక్ష కోట్లు కావాలని జగన్ అన్నారు.









