AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాజీపేట్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రైలు బోగీలో భారీ మంటలు

వరంగల్: కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాగన్‌లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ మంటల్లో పాత ప్యాసింజర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ప్రమాదం జరిగినప్పుడు రైలులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇందులో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయని వెల్లడించారు. స్టేషన్‌లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసి పడ్డట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు.

ANN TOP 10