AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ‌దిలీపై వెళ్తున్న క‌లెక్ట‌ర్ కు కంది శ్రీ‌నివాస రెడ్డి వీడ్కోలు

సేవ‌ల‌ను ప్ర‌శంసిస్తూ శాలువాతో స‌త్కారం
మ‌రింత ఉన్న‌త స్థితికి చేరుకోవాల‌ని ఆకాంక్ష

అమ్మ‌న్యూస్ ప్ర‌తినిధి ఆదిలాబాద్ : బ‌దిలీపై వెళ్తున్న జిల్లా క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్ కు వీడ్కోలు ప‌లికారు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి. నిన్న సాయంత్రం కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ట్రాన్ష్ ఫ‌ర్ పై మెద‌క్ జిల్లాకు వెళ్తున్న క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్ ను శాలువాతో స‌త్క‌రించారు.ఇన్నాళ్లు త‌న స‌ర్వీస్ లో జిల్లాకందించిన సేవ‌ల‌ను కొనియాడారు.జిల్లా క‌లెక్ట‌ర్ గా త‌న విధుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించార‌ని అన్నారు. జిల్లాలో వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నార‌ని మున్ముందు త‌న ఉద్యోగ జీవితంలో మ‌రింత ఉన్న‌స్థితికి చేరుకోవాల‌ని ఆకాంక్షించారు.ఆయ‌న వెంట డీసీసీబీ చైర్మన్
అడ్డి భోజా రెడ్డి,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాల్ల పోతా రెడ్డి,బాయిన్ వార్ గంగా రెడ్డి గార్లు తదితరులున్నారు.

ANN TOP 10