AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కుటుంబ సమేతంగా భేటీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జంపింగ్ జపాంగుల పర్వం ఊపందుకుంటోంది. ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిగా నేతలు.. అధికార కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే.. భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఊపందుకున్నాయి.

భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావ్ పార్టీ మారుతున్నట్లుగా కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ఇతర ముఖ్య నేతలతో సమావేశమై మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. కాగా.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు.. టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్‍‌లో చేరి భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచారు.

కాగా.. ఎన్నికల ఫలితాల రోజే.. కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టత వచ్చిన సమయంలోనే.. తెల్లం వెంకట్రావు మళ్లీ హస్తంలోకి తిరిగి వచ్చేస్తున్నారన్న వార్తలు ప్రచారమయ్యాయి. రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. అటు ఫలితాలు వచ్చాయో లేదో ఇటు పార్టీ మార్పులు మొదలయ్యాయన్న చర్చ కూడా నడిచింది. అయితే అవి పాత ఫోటోలని ఆయన కొట్టిపడేశారు. అనంతరం పలుమార్లు కాంగ్రెస్ నేతలను కూడా కలవడంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు తెరపైకి వచ్చాయి.

ANN TOP 10