AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరగనున్న మహా జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొక్కులు, వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూపాయలు 3. 14 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే విధంగా ట్రైబల్ శాఖ నుంచి రూ. 2. 30 కోట్లను కేటాయించగా.. అలాగే కేంద్ర పర్యాటక శాఖ నుంచి మేడారం జాతరకు రూ. 80 లక్షలు కేటాయించింది. అయితే మేడారానికి కేంద్రం రూ. 3 కోట్లు కేటాయించిందని ఇటీవల కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ANN TOP 10