AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు

రథసప్తమి సందర్భంగా యాదగిరిగుట్టలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్యప్రభ వాహనం సేవపై ఆలయ తిరు వీధుల్లో అర్చకులు ఉరేగించారు.

స్వామి వారిని ఆలయ తిరు వీధుల్లో ఉరేగించిన అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నయనాందకరమైన ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు తన్మయం చెందారు. రాత్రి 7 గంటలకు బంగారు రథంపై స్వామి వారిని ఆలయ తీరు మాడ వీధుల్లో ఉరేగించనున్నారు.

ANN TOP 10