తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఇరిగేషన్ శాఖపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో కృష్ణ ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించబోమంటూ తీర్మానం చేశారు. నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు సందర్శించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానం పంపుతున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగే అవకాశం ఉంది.









