AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోరమ్ విషయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం..

హైదరాబాద్: బడ్జెట్‌పై స్పందన అనంతరం జీరో అవర్ ప్రారంభమైంది. కొత్త ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీ స్పీకర్ సమయం ఇవ్వనున్నారు. అయితే కోరమ్ విషయంలో అధికార, విపక్షాల మధ్య చిన్నపాటి వాగ్వాదం నడిచింది. కోరమ్ లేకుండా సభ నడుపుతున్నారని.. ఇది సభ రూల్స్‌కు విరుద్ధమని కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి 18 మంది సభ్యులు సభలో ఉన్నారని శ్రీధర్ బాబు అన్నారు. కోరమ్ స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కోరమ్‌కు 12 మంది సభ్యులు ఉంటే సరిపోతుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ANN TOP 10