ఇంగ్లాండ్‌తో జరగనున్న మరో 3 టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా తమ జట్టును ప్రకటించింది. ఈ మేరకు శనివారం బీసీసీఐ మూడు టెస్టులకు సంబంధించిన జట్టును ఖరారు చేసింది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో ఐదు మ్యాచ్‌లు టెస్టు సిరీస్ 1 – 1 తేడాతో సమంతో ఉంది. వ్యక్తిగత కారణలతో జట్టుకు దూరం అయిన విరాట్ కోహ్లీ మిగిలిన మ్యాచ్‌లకు ఎంపిక చేయకపోగా.. గాయాలతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అయ్యాడు.
అదే విధంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలర్ అశ్విన్‌లు తిరిగి జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యార్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. ఇక రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చివరి రెండు టెస్టులు రాంచీ (ఫిబ్రవరి 23), ధర్మశాల (మార్చి 7)లో జరుగుతాయి.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (సీ), జస్ప్రీత్ బుమ్రా (వీసీ), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకే), కేఎస్ భరత్ (డబ్ల్యు కే), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్‌లు జట్టులో ఉన్నారు.









