ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశపరచింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024 -25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2.75 లక్షల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌ను ఆయన సభలో ప్రవేశ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌తో పాత పేర్లు మార్చి.. కొత్త పేర్లు పెడుతున్నారు అంతే అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం సరిపోందని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై వారికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రగతి గేర్లు మార్చే అంశాలేమీ బడ్జెట్‌లో లేవని దుయ్యబట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నో హామీలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని అన్నారని, ఆ ప్రస్తావన లేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.









