గత ఐదేళ్లలో దేశంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం లోక్‌సభలో శ్రీరామ మందిరం ధన్యవాద తీర్మాణంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చామని, రిఫార్మ్, పెర్ఫామ్, ట్రాన్స్ ఫర్ మీదనే దృష్టి పెట్టినట్టు గుర్తు చేశారు. 17వ లోక్‌సభను దేశం తప్పకుండా ఆశీర్వాదిస్తుందని అభిప్రాయపడ్డారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కరోనా సమయంలో ఎంపీలు తమ జీతాన్ని బాధితులకు ఇచ్చారని, దీంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఆ సమయంలో ఎంపీలు 30 శాతం తమ జీతాన్ని విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశాన్ని ఎప్పుడు వెనకడుగు వేయనివ్వలేదన్నారు. శతాబ్దంలో ఎన్నో అతి పెద్ద విపత్తులను ఎదుర్కొన్నామని, అలాంటి విపత్తులు వచ్చిన అభివృద్ధి మాత్రం ఆగలేదని తెలిపారు.
సింగోల్‌ను మార్గదర్శకంగా స్థాపించుకున్నామని, కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఎన్నో ఏళ్ల ఆంకాక్షను నెరవేర్చిందన్నారు. దేశంలో జీ 20 సమావేశాలు నిర్వహించమని, దాంతో భారత్ ప్రతిష్ట పెరిగిందని వెల్లడించారు. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో అనేక సంస్కరణలు గేమ్ ఛేంజర్‌లా మారాయన్నారు. పేపర్ లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. చట్ట సభల్లో మహిళా బిల్లులను ఆమోదించుకున్నామని, తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.









