వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందని వ్యాఖ్యానించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని విజయసాయి రెడ్డి అన్నారు. అందుకుగాను ఇప్పటికే ఆయనపై పోలీసు స్టేషన్లో పిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని అన్నారు. విజయసాయి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. షర్మిల వల్ల కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు అని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని నిలదీశారు. బానిసత్వంతో ప్రధాని మోడీని జొకడమే పనిగా పెట్టుకున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.









