AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల్లో ఓటమి కోసమే వాళ్ల కష్టాలు: ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పక్షాలు చాలాకాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పించాయని జోస్యం చెప్పారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నందున దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నానని తెలిపారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరించారని అన్నారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని అన్నారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎత్తిపొడిచారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కానీ మన విపక్షాల తీరు పట్ల దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని అన్నారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని, నేటి విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చాక ఇంకా సంచలన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తమ పాలనను చూసి ప్రజలు వెయ్యేల్లు గుర్తు చేసుకుంటారన్నారు. పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని వెల్లడించారు. 50 కోట్ల మంది ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించామని, 55 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామని తెలిపారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అబ్ కీ బార్ మోడీ సర్కార్ అంటూ వ్యాఖ్యానించారు. మరో వంద రోజుల్లో తమ ప్రభుత్వం మరోసారి రాబోతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ANN TOP 10