AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజృంభించిన బౌలర్లు.. టీమిండియా భారీ విజయం

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం అందుకోగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1 – 1 తేడాతో సమంగా ఉంది. ఇక విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్‌ను నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లలో యశశ్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆకాశమే హద్దుగా చేలరేగి ఆడాడు. 290 బంతుల్లో 7 సిక్స్ లు, 19 ఫోర్లతో జైస్వాల్ (209) పరుగులు చేశాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు దిశగా వెళ్లింది. అలాగే ఓపెనర్‌ రోహిత్ శర్మ (14), శుభమన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పటీదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) పరుగులు చేసి ఔట్ అయ్యారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (20) పరుగులు చేశాడు.

అటు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ (76) రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా పరుగులు రాణించలేకపోయారు. ఆలీ పోప్ (23), జో రూట్ (5) ఘోరంగా విఫలమయ్యారు. జానీ బెయిర్‌స్టో (47) పరుగులు చేసి పర్వాలేదనించాడు. టామ్ హార్ట్లీ (21) రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యే సమయానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తి అయ్యే సమయానికి టీమిండియా 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో స్కోర్‌లో పట్టు సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే ప్రదర్శన చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. కేవలం (13) పరుగులు చేసి మైదానాన్ని విడవగా.. జైస్వాల్ (17) పరుగులకే ఔట్ అయ్యాడు. ఇద్దరు ప్లేయర్లు ఓకే సమయంలో వికెట్లు కోల్పోడంతో ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ జట్టును ఆదుకున్నాడు. గిల్ (104) సెంచరీ చేయడంతో టీమిండియా భారీ అధిక్యంలోకి వెళ్లింది. అటు అక్షర్ పటేల్ కూడా దూకుడుగా ఆడి (45) రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ తలా (29) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు.

టీమిండియా ఆలౌట్ అయ్యాక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. టీమిండియా బౌలర్లు మరోసారి రెచ్చిపోవడంతో (50) పరుగుల వద్ద నుంచే వికెట్ల పతనం ప్రారంభమైంది. జాక్ క్రాలీ మరోసారి జట్టుకు కీలకంగా మారాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో (76), ఆ తర్వాత (73) రన్స్ చేశాడు. ఈ ప్లేయర్ తప్ప జట్టులోని మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో 292 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌట్ కావడంతో టీమిండియా మ్యాచ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి సత్తాచాటిన టీమిండియా బౌలర్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌ లో కూడా 3 వికెట్లు తీశాడు. అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో టెస్టు మ్యాచ్ గుజరాత్ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది.

ANN TOP 10