హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఆయన వద్ద బంగారం, వెండి, నగదే కాదు.. భూములు ఎన్ని ఉన్నాయో తెలిసి ఏసీబీ అధికారులే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 120 ఎకరాలకు పైగా స్థలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను గుర్తించడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులను శివ బాకలృష్ణ పెట్టేశారు. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
కాగా.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో పట్టుబడ్డ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.









