పూరించనున్న ముఖ్యమంత్రి రేవంత్
ఇంద్రవెల్లిలో నేడు తెలంగాణ పునర్నిర్మాణ సభ..
మరో రెండు గ్యారంటీ పథకాలను ప్రకటించే అవకాశం
లక్షలాదిగా తరలివస్తున్న జనం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నేడు తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. అలాగే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి, స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా నేడు రూ.160కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు లక్ష మంది వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గ్యారంటీలలో మరో రెండు పథకాలను సీఎం రేవంత్ ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. నాగోబా దేవస్థానం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాగోబా దర్శనం తరువాత ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రానున్నారు. తర్వాత పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.

ఇంద్రవెల్లి లో పునర్నిర్మాణ సభ షెడ్యూల్ ఇదే..
– మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కెస్లాపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.
– మధ్నాహ్యం 1.35 గంటలకు రోడ్డు మార్గాన వెళ్లి నాగోబా దర్శనం.
– మధ్నాహ్నం 1.45 నుంచి 2.15 వరకు నాగోబా దేవస్థానం గోపురం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం.
– మధ్నాహ్నం 2.15 నుంచి 3.15 వరకు దర్బార్ హాల్ లో కార్యక్రమాలకు హజరు.
– మధ్నాహ్నం 3.15 నాగోబా నుంచి రోడ్డు మార్గాన ఇంద్రవెల్లి కి రానున్న సీఎం రేవంత్.
– మధ్నాహ్నం 3.30 అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. అనంతరం మధ్యాహ్నం 3.50 నుంచి 4.50 వరకు భారీ బహిరంగ సభ.
– మధ్నాహ్నం 4.55 కు తిరుగుపయనం కానున్నారు.









