లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జగిత్యాల పరిధిలో జరిగిన ప్రభుత్వం కార్యక్రమానికి కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఇప్పటి రాజకీయాలు వేరు, అప్పటి రాజకీయాలు వేరని.. అలా అయితే పాత నాయకులంతా కాంగ్రెస్ పారీ నుంచే వచ్చిన వారని అన్నారు.
గతంలో జీవన్‌రెడ్డి కూడా టీడీపీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారని అన్నారు. గతంలో తమ కుటుంబం అంతా కాంగ్రెస్ పారీలోనే ఉన్నారని, నేను చిన్నప్పుడు అదే జెండాను పటుకుని వీధుల వెంట తిరిగిని వాడినేనని పేర్కొన్నారు. ఆ క్రమంలో జీవన్రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే.. ఆ పార్టీకే ఓటు వేశానని తన గత జ్ఞాపకాలను సంజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.









