AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్‌ .. కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో డ్రైవర్లు

హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు(Autos bandh) పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు (JAC) బుధవారం రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు.

రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతామని వెల్లడించారు. ఈ బంద్‌కు బీఆర్‌టీయూ, సీఐటీయూ, ఎఫ్‌యూటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు మద్ధతు తెలిపాయని టీఏటీయూ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. తెలంగాణలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.వెంకటేశం, ఎస్‌.నర్సింహారెడ్డి, పి.శ్రీకాంత్‌, వి. కిరణ్‌, ఎ.సత్తిరెడ్డి, సలీం, మీర్జారఫత్‌బేగ్‌, సతీష్‌, ప్రేంచందర్‌ రెడ్డి, తిరుమలేష్‌గౌడ్‌, రాజేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ANN TOP 10