AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీశైలంలో చిరుత సంచారం.. ఆందోళనలో భక్తులు..

తిరుమల నడక మార్గంలోనే కాకుండా శ్రీశైలంలో కూడా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో చిరుత సంచరిచడంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వారు భయపడతున్నారు. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం వద్ద ఉన్న హోమగుండం దగ్గర గోడపై చిరుత పులి కూర్చుని ఉండటం భక్తులు గమనించారు. వారిని చూసిన చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. భక్తులు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. చిరుత రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ఆవును చంపింది. చిరుత పులి సంచారంతో భక్తులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

రత్నానంద ఆశ్రమం వద్ద గోడపై కూర్చుని ఉన్న చిరుత పులి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శ్రీశైలం దేవస్థానానికి భారీగా భక్తులు తరలొస్తున్నారు. శ్రీశైలంలో రోజురోజుకూ చిరుత పులుల సంచారం పెరుగుతూనే ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. రోహిత్ శర్మ పేరు మీద చెరిగిపోని రికార్డ్ శ్రీశైలం అటవీ ప్రాంతం కావడంతో చిరుత పులుల సంచారం పెరుగుతోంది. చిరుత కనిపించినప్పుడల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే తాము ఎన్నిసార్లు కంప్లెయింట్‌లు ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చిరుత వీడియోలు వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించిన వివరాలు సేకరించారు. చిరుత పాదముద్రలను సేకరించి.. ఆవుని చంపి తిన్నది చిరుత పులి అని గుర్తించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని కోరుతున్నారు. చిరుత అడుగుల ఆధారంగా అది ఎటువైపుకు వెళ్లిందనే దానిపై అటవీ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు. 3 నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డులోని రుద్రాపార్కు సమీపంలో గోడపై కూర్చుని చిరుతపులి కనిపించిదని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు చిరుత కనిపించడంపై భయపడుతున్నారు.

ANN TOP 10