AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరోనా విజృంభణ: ఒక్కరోజే దేశంలో 798 పాజిటివ్ కేసులు

భారతదేశంలో మళ్లీ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో ఆందోళన చోటు చేసుకుంది. కరోనా విస్తరిస్తున్న వేళ ప్రస్తుత పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతీరోజూ కొత్తగా ఎన్నికైన కేసులు నమోదయ్యాయో లెక్కలు చెబుతోంది. గత 24 గంటలలో భారతదేశంలో 798 పాజిటివ్ కేసులు వచ్చాయని పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఒక రోజే కరోనా మహమ్మారి కారణంగా ఐదుగురు మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో 4091 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు భారతదేశంలో 157 కరోనా కొత్త వేరియంట్ జె ఎన్ 1 కేసులు నమోదైనట్టు గా సమాచారం. అయితే రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకోవడం, గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వెళ్లిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే కరోనా మహమ్మారి సోకదని చెబుతున్నారు. కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు, ఎవరికి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

ANN TOP 10