AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో 8మందికి కరోనా చికిత్స

ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలోని కరోనా వార్డులో 8మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా ఆస్పత్రి నుంచి అనుమానిత శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించగా రోజుకు ఒకటి, రెండు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 8 మంది పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు. గురువారం 22 శాంపిల్స్‌ని గాంధీ ఆస్పత్రికి పంపించగా ఒకరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. శుక్రవారం మరో 30 అనుమానిత శాంపిల్స్‌ని గాంధీ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించామని ఆయన తెలిపారు.

ANN TOP 10