AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఈసీ దృష్టి..

తెలంగాణలో రాష్ట్ర శాసన మండలిలో త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ తరుణంలో వీటి స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం శుక్రవారం ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇటీవల ఆయా స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఈసీ. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాల స్వీకరించనున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నది. పట్టభద్రులందరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో మన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో వేచి చూడాలి. ఒకవైపు లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రాజకీయ వేడిని రాజేస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ మునుపటి కంటే కూడా మంచి ప్రభావం చూపించింది.

ANN TOP 10