AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

6 గ్యారంటీల కోసం పోటీపడ్డ జనం.. ఇప్పటికే ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే…

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తోంది. ప్రజాపాలన అభయ హస్తం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తూ ఊరు ఊరునా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి అర్హులంతా పోటీపడి మరీ దరఖాస్తులు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జనం బారులు దీరారు. తొలిరోజు ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.

నిన్ననే దరఖాస్తుల స్వీకరణ మొదలు కావడంతో ఉదయం నుంచే దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. దీంతో తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7.46 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు గాను పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయట. ఇందులో గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా.. జీహెచ్‌ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో 4,57,703 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ వివరాలు వెల్లడించారు.

ANN TOP 10