AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలా ‘బాద్‌ షా’.. కంది శ్రీనివాసరెడ్డి

విజయంపై శ్రేణుల్లో ధీమా
మెజారిటీ పై బెట్టింగులు
పోలింగ్‌ శాతం 77.2
గత ఎన్నికలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల
ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డి విజయం నల్లేరుపై నడకే అంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. తెలంగాణలో వీస్తున్న కాంగ్రెస్‌ అనుకూల పవనాలకు తోడుగా నియోజకవర్గంలో కంది ప్రభంజనం ముందు ప్రత్యర్థ్యులు తట్టకుని నిలబడటం కష్టమే అంటున్నారు. శ్రీనన్నకు ఎదురే లేదంటున్నారు ఆయన అభిమానులు. నియోజకవర్గంలో 77.2% పోలింగ్‌ శాతం నమోదు అయింది గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది .గత ఎన్నికల్లో 82 శాతం నమోదయింది .మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ హామీలు, శ్రీనన్న సేవాకార్యక్రమాలు, ఆయన మంచితనం ,వ్యక్తిగత ఇమేజ్‌ ను దృష్టి లో ఉంచుకొని తమ అభ్యర్థి వైపే మొగ్గు చూపారని దీంతో కంది శ్రీనివాసరెడ్డి విజయం తధ్యమంటున్నారు . అటు బీజేపీ బీసీ ముఖ్య మంత్రి ప్రకటన తో అదే సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ అభ్యర్థి ఓట్ల చీలిక కూడా తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందంటున్నాయి. నియోజకవర్గంలో కొన్నిచోట్ల మెజార్టీ పై బెట్టింగులకు కూడా దిగుతున్నట్టు సమాచారం. అటు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నాయి.

ANN TOP 10