డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలపై మంత్రి కేటీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.









