AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎందుకు ఆగమైతుండ్రు.. మల్లా మనమే వస్తాం.. నేతలతో కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా నిన్న(నవంబర్ 30)న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (CM KCR) పలువురు అభ్యర్థులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలో నేతలకు కేసీఆర్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే అని అభయమిచ్చారు. ‘‘ఎందుకు ఆగమాగం, పరేషాన్ అయితుండ్రు… మల్లా మనమే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం’’ అంటూ ప్రగతిభవన్‌లో కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ గెలుపు ధీమాను వ్యక్తంచేశారు.

ANN TOP 10