AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ వ్యాప్తంగా మొదలైన పోలింగ్..

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. చలి కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతోంది. కొన్ని చోట్ల ఆదిలోనే వీవీప్యాట్‌ మొరాయించడంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారు వేచి చూస్తున్నారు. ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ సిస్టం ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీ క్లబ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. సినీ నటుడు సుమంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే, కొందరు ఓటర్లకు నిబంధనలపై అవగాహన లేక మొబైల్ ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. అక్కడి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు వెనుదిరగాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ క్యూలైన్లో నిలబడి ఓటువేయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందే ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

ANN TOP 10