AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటు వేసేందుకు మైసూర్‌ నుంచి హైదరాబాద్‌కు రామ్ చరణ్‌..

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఉన్నట్లుండి తన షూటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. గురువారం (నవంబర్ 30) జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుమైసూర్‌ నుంచి ఒక ప్రైవేట్‌ విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మైసూరు విమానాశ్రయంలో రామ్ చరణ్ కనిపించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం సిబ్బంది రామ్‌ చరణ్‌తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ప్రయాణ హడావిడిలో ఉన్నప్పటికీ చెర్రీ ఎంతో ఓపికగా అభిమానులతో ఫొటోలు దిగాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా జూబ్లీహిల్స్‌ క్లబ్‌ పోలింగ్‌ బూత్‌ 149లో మెగా ఫ్యామిలీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ తదితరులు ఇక్కడే ఓటు వేయనున్నారు.

ANN TOP 10