తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ప్రీ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు ఈసారి ఓటర్లు హ్యాండ్ ఇచ్చి హస్తం గుర్తు పార్టీతో షేక్ హ్యాండ్ ఇస్తారని సౌత్ ఫస్ట్ సర్వే చెబుతోంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ప్రీ పోల్ సర్వే(Pre Poll Survey)ఫలితాలు వెల్లడయ్యాయి. గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (BRS)పార్టీకి ఓటర్లు ఈసారి ఓటర్లు హ్యాండ్ ఇచ్చి హస్తం గుర్తు పార్టీతో షేక్ హ్యాండ్ ఇస్తారని సౌత్ ఫస్ట్ సర్వే(South First) చెబుతోంది.ఈ సర్వే ప్రకటించిన ఫలితాల ఆధారంగా చూసుకుంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ (Congress)ఉంది.ప్రీ పోల్ సర్వే ప్రకారం 57-నుంచి 62 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తారని ప్రకటించింది. ఇక అధికార బీఆర్ఎస్ 41-46 సీట్లు గెలిచే ఛాన్సు ఉందని సర్వే తేల్చింది.అధికారం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీ (BJP)మూడో స్థానం కూడా దక్కించుకోదని సర్వే ద్వారా తెలుస్తోంది.
హస్తం పార్టీదే హవా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ సవాల్ గా తీసుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గెలిచే అవకాశం తక్కువగానే ఉందని ప్రీ పోల్ సర్వే ద్వారా వెల్లడైంది. సౌత్ ఫస్ట్ నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వే ప్రకారం ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఈసారి 57-నుంచి 62 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని పేర్కొంది.ఇక అధికార బీఆర్ఎస్ 41-46 సీట్లు గెలిచే ఛాన్సు ఉందని సర్వే తేల్చింది.









