AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడు రోజులు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారయింది. దీనికోసం తెలంగాణ బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మోదీ ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు.. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ ఉంటారు.

ANN TOP 10