AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ జిల్లాల్లో బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవదు.. బండ్ల గణేష్ కీలక కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈసారి ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే చర్చ సామాన్యుల ప్రజల్లోనూ మెుదలైంది. ఎవరికి వారు పార్టీల గెలుపుపై ఓ అంచనాకు వస్తున్నారు. సర్వేలు కూడా ఆసక్తికర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి.. ఇంకొన్ని హంగ్ వస్తుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నిర్మాత, సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవని జిల్లాలో ఏవే చెప్పేశాడు. ఈసారి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవదు అని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. ఆ రెండు జిల్లాలను కాంగ్రెస్‌ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.

ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని.. ఈ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని ఆయన జోశ్యం చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏ మాత్రం సందేహం లేదన్నారు. తాను ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌లో లేకున్నా.. మీడియాలో కనిపించకున్నా.. కాంగ్రెస్ గెలుపు కోసం ఏం చేయాలో అది చేస్తున్నాని అన్నారు. ఈసారి తనకు ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నారని.. ఆయన సీఎం కుర్చీలో కూర్చుంటే.. తాను అధికారాన్ని సొంతం చేసుకున్నట్లేనని బండ్ల గణేష్ అన్నారు.

ANN TOP 10