తలకిందులుగా తపస్సు చేసినా వారి డిపాజిట్లు గల్లంతే
కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్ః తలకిందులుగా తపస్సు చేసినా జోగు రామన్న, పాయల శంకర్‌కు ఈసారి డిపాజిట్లు కూడా దక్కబోవని ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్ కాంగ్రెస్‌లోకి రావడంతో నూతనోత్సాహం కన్పిస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం పట్టణంలోని ప్రజాసేవా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని, అందులో ఏమాత్రమూ సందేహం అక్కర్లేదని చెప్పారు. సర్వేలు సైతం అదే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ ఒక్కరినీ పలకరించిన వందలో 70 శాతం మంది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు.

అటు బీఆర్ఎస్‌లో తనకు సరైన గౌరవం దక్కకపోవడంతోనే తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని, తనపై కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారని అన్నారు. జోగు రామన్న తన కొడుకులకే పదవులు ఇప్పించుకున్నారని, కష్టపడి పార్టీ కోసం పనిచేసిన తనలాంటి వారిని ఎదగనివ్వలేదని ఆరోపించారు. అప్పటి నుండే జోగు రామన్నకు తాను దూరమయ్యానని వెల్లడించారు. ప్యాకేజీలకు ఆశపడే వ్యక్తిత్వం తనదికాదని, తన సొంత జేబులో నుంచి పార్టీ కోసం ఖర్చుచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అంతకుముందు పలువురు నేతలకు కంది శ్రీనివాసరెడ్డి శాలువాలు కప్పి సత్కరించారు. సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షెడ్మకి ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ పూసం ప్రభాకర్, సీనియర్ నేత ఐనేని సంతోష్‌రావు, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండూరి రవి, నాయకులు సుజాత్ అలీ, రాజ్ మహమ్మద్, డేరా కృష్ణా రెడ్డి, ఎంఏ. షకీల్, మానే శంకర్,రాజా లింగన్న, జైన్ లలిత్, తకీమ్ ఉద్దీన్, ఓసావార్ సురేష్, గేడం అశోక్,సునిల్, ఆడే విట్టల్, దీపక్ రావు, ముత్యాల నిఖిలేష్, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బండి కిష్టన్న, గడ్డం రామ్ రెడ్డి, గోలి వెంకటి, లింగన్న, ముఖీమ్, అమ్జద్‌ఖాన్, కర్మ, రహీం ఖాన్, అఖీమ్, అస్బాత్ ఖాన్, హరీష్ రెడ్డి మహమూద్, యాసం రాము, ఎలాల్ సంజీవ్ రెడ్డి, రంగినేని కిషన్ రావు, అశోక్, రమేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.









