AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య..!

వచ్చే సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న వినాయక చవితి పండుగ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సారి ఖైరతాబాద్‌లో పంచముఖ సంకటహర మహాగణపతిని ప్రతిష్టించనున్నారు. అందుకుగాను 69 అడుగుల ఎత్తు కల్గిన ఈ మహాగణపతి పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణపయ్య వచ్చే గణేశ్ ఉత్సవాల్లో సరి కొత్త రూపంలో దర్శనమివ్వనున్నాడు.

 

72 ఏళ్లు పూర్తి..

భారీ గణపయ్య ఉత్సవాలు ఈ సారి ఉత్సవాలతో 72 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాయి. విగ్రహానికి ఒక వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరో వైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు ఉత్సవ కమిటీ త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఎడాది గణనాదుడు పంచముఖ సంకటహర మహాగణపతిగా వెలువడనున్నాడు. త్వరలో దీనికి సంభందించిన మరిన్ని కార్రమాలను ఉత్సవ కమిటీ తెలియ చేస్తామని అధికారులు తెలిపారు.

ANN TOP 10