తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. కొత్తగా పోటీ చేసే మరో రెండు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ఒవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకత్పురా నుంచి జాఫర్‌హుస్సేన్ మిరాజ్ పోటీ చేయనున్నారు. మలక్‌పేట నుంచి అహ్మద్బలాల, కార్వాన్‌నుంచి కౌసర్‌మొయినుద్దీన్ పోటీ చేస్తారని అసదుద్దీన్ తెలిపారు. బహదూర్‌పూరా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఒకటి రెండు రోజల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సిట్టింగ్ఎమ్మల్యేలైనా పాషా ఖాద్రీ, ముంతాజ్హేమంత్ఖాన్ఈసారి ఎన్నికల బరిలో నిలబడటం లేదని తెలిపారు. తాము పోటీ చేయబోయే ప్రతి స్థానంలో గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా, జూబ్లీహిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.









