AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం..!

మిర్జాపూర్’…ఈ సిరీస్ కి ఆడియన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఇందులోని శృతి మించిన డైలాగులు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేశాయి.అలాంటి మోస్ట్ పాపులర్ డ్రామా సిరీస్ ఇపుడు మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమైంది.ఈ క్రమంలోనే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో ఈ భారీ యాక్షన్ ఫ్రాంచైజీ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడమే కాకుండా, అదిరిపోయే ఒక క్రేజీ టీజర్‌ను కూడా వదిలారు. వెండితెరపై ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉండబోతోందో చూపిస్తూ విడుదలైన ఈ అఫీషియల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

 

పాత జ్ఞాపకాలను కళ్లముందు ఉంచుతూనే,రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ క్రేజీ టీజర్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కట్ చేశారు మేకర్స్.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన, అభిమానులను థ్రిల్‌కు గురిచేసిన విషయం ఏమిటంటే.. మూడో సీజన్‌లో కనిపించకుండా పోయిన క్యారెక్టర్స్ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్షం కావడం.

 

మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్న మున్నా భయ్యా

Advertisement

భయమంటే తెలియని కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి తనదైన గంభీర ముద్రతో ఎంట్రీ ఇవ్వగా, చేతిలో గన్‌ పట్టుకుని విధ్వంసం సృష్టించే గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్ మునుపటి కంటే మరింత వైల్డ్‌గా కనిపించాడు. అన్నింటికంటే ముఖ్యంగా, సిరీస్‌లో చనిపోయాడని భావించిన అందరి ఫేవరెట్ మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మాంచి ఐ ఫీస్ట్ అనే చెపాలి.

‘మిర్జాపూర్ గద్దె నాదే’ అంటూ మున్నా భయ్యా చెప్పే డైలాగ్స్ థియేటర్లలో ఏ రేంజ్‌లో ఈలలు వేయిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా.

 

హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో విందు

ఇక ఈ సినిమాటిక్ వెర్షన్‌లో పాత కాస్టింగ్‌తో పాటు సరికొత్త పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కూడా తోడయ్యాయి. టాలెంటెడ్ యాక్టర్ రవి కిషన్, అలాగే ‘పంచాయత్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జితేంద్ర కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరవనుండడం స్టోరీకి మరింత అసెట్. గతంలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన పంచాయత్’క్రాస్‌ఓవర్ ఎపిసోడ్‌ను గుర్తుచేస్తూ జితేంద్ర కుమార్ ఎంట్రీ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 

Advertisement

కేవలం ఒక ప్రాంతీయ ఆధిపత్యం కోసమే కాకుండా, ఈసారి దేశవ్యాప్త అధికారం మరియు పొలిటికల్ మైండ్ గేమ్స్ నేపథ్యంలో ఈ యుద్ధం జరగబోతోందని టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మరింత భారీ బడ్జెట్‌తో, మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ వెండితెర విందును ప్లాన్ చేశారు మేకర్స్

 

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని క్రియేట్ చేస్తాడో

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోయే సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో వచ్చినమిర్జాపూర్ రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. మొదట కేవలం హిందీ బెల్ట్‌కే పరిమితం అనుకున్నప్పటికీ, ఈ సిరీస్‌కు సౌత్ ఇండియాలో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

 

ఓటీటీ స్క్రీన్‌లపై చిన్న మొబైల్‌లలో చూసి ఎంజాయ్ చేసిన మిర్జాపూర్ వైలెన్స్‌ను, ఇప్పుడు డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద తెరపై చూడటం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా నిలవబోతోంది.చూడాలి మున్నా భయ్యా ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని క్రి

యేట్ చేస్తాడో !

 

ANN TOP 10